Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎయిర్ ఇండియా కొత్త లోగోతో మెరిసిపోతున్న విమానం.. తొలి ఫొటో విడుదల చేసిన సంస్థ

first look of the majestic A350
Advertisement
  • భారీ రీబ్రాండింగ్‌కు పూనుకున్న ఎయిర్ ఇండియా
  • లోగో సహా వివిధ రకాల మార్పులకు శ్రీకారం
  • కొత్త లోగోతో ఉన్న ఏ350 విమానం తొలి ఫొటోను విడుదల చేసిన సంస్థ
  • రాజసం ఉట్టిపడేలా ఉందంటూ కామెంట్
Advertisement
ఎయిర్ ఇండియా కొత్త లోగోతో కూడిన విమానం ఫస్ట్ లుక్‌ను సంస్థ తాజాగా విడుదల చేసింది. రాజసం ఉట్టిపడేలా కొత్త లుక్ ఉందని కామెంట్ చేసింది. నూతన లోగోతో కూడిన విమానాల డెలివరీ మరికొన్ని నెలల్లో ప్రారంభమవుతుందని ప్రకటించింది. ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్ ఇండియాను టాటాలు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఎయిర్ ఇండియా రిబ్రాండింగ్‌కు టాటా సంస్థ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా కొత్త లోగో, ఇతర చిహ్నాలతో పాటూ అత్యాధునిక విమానాల కొనుగోలుకు కూడా రెడీ అయింది. మునుపటి ఎర్రటి షేడ్స్ స్థానంలో గోల్డెన్ కలర్ షేడ్స్‌ను ప్రవేశపెట్టింది. విమానం టెయిల్ భాగంలో కూడా స్వల్ప మార్పులు చేసింది. ఎరుపు, గోల్డెన్, పర్పుల్ రంగులకు చెందిన షేడ్స్‌లోని డిజైన్‌ను జోడించింది. కొత్త డిజైన్లతో కూడిన ఎయిర్‌బస్ ఏ350 విమానం ఫొటోలను ఎక్స్ వేదికగా షేర్ చేసింది. 

ప్రజల మనసుల్లో పాత ఎయిర్ ఇండియా గుర్తులను పూర్తిగా చెరిపేసేందుకు సంస్థ రీబ్రాండింగ్‌కు దిగింది. ఇందు కోసం మొత్తం రూ.18 వేల కోట్లను ఖర్చు పెడుతోంది. సంస్థ ఫ్లీట్లలోని విమానాలకు కొత్త లోగోలు, ఇతర చిహ్నాలను జత చేస్తోంది. అంతేకాకుండా, దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా వివిధ మోడళల్లో కొత్త 470 విమానాలను కూడా కొనుగోలు చేస్తోంది.
Advertisement
Advertisement
Air India

More Telugu News